న్యూయార్క్, అక్టోబర్ 19: మీకు మధుమేహం ఉందో, లేదో తెలుసుకోవాలనుకొంటే.. మీ మాటలు రికార్డ్ చేసి టెస్ట్ చేస్తే చాలు! కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన వాయిస్ టెక్నాలజీకి సంబంధించిన తాజా అధ్యయనం ఇది సాధ్యమేనని అంటున్నది. వ్యక్తులు 6-10 సెకన్ల పాటు మాట్లాడిన మాటలు, వారి ప్రాథమిక ఆరోగ్య వివరాల సాయంతో వారికి టైప్ 2 డయబెటిస్ ఉందా లేదా అనే విషయాన్ని కనుగొనవచ్చని అమెరికాలోని క్లిక్ ల్యాబ్స్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మయో క్లినిక్ ప్రోసీడింగ్స్: డిజిటల్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం ఈ వాయిస్ టెక్నాలజీ ద్వారా మహిళల్లో 89 శాతం, పురుషుల్లో 86 శాతం కచ్చితత్వంతో డయబెటిస్ ఉందో లేదో నిర్ధారించవచ్చు.