కరాచీ: పాకిస్థాన్‌లో ఓ మహిళ తన కారుతో బీభత్సం సృష్టించింది. కర్సాజ్ రోడ్డులో తన టొయోటా ల్యాండ్ క్రూయిర్ వాహనంతో మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకూతుళ్లు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి. కారుతో వీరంగం సృష్టించిన ఆ పాకిస్థాన్ మహిళను నటాషా దానిష్ అలీ(Natasha Danish Ali)గా గుర్తించారు. పాక్‌లోని ప్రఖ్యాత వ్యాపారవేత్త దానిష్ ఇక్బాల్ భార్య ఈమె. ఆగస్టు 19వ తేదీన జరిగిన ఆ ఘటనకు చెందిన కొన్ని వీడియోలు రిలీజయ్యాయి. కారుతో ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారణమైన ఆమె .. ఆ సంఘటన తర్వాత వింతగా ప్రవర్తించింది. కెమెరా వైపు నవ్వుతూ చూసింది. ఎటువంటి పశ్చాతాపం ఆమెలో కనిపించలేదు. అక్కడ ఉన్న వారిని బెదిరించింది. నా తండ్రి ఎవరో మీకు తెలియదని వార్నింగ్ కూడా ఇచ్చింది.
It’s shameful how #Natasha flaunts her wealth & arrogance while mocking #Pakistan’s laws & justice system. This is the elite’s disregard for accountability, where the poor face prisons, punishments, detentions, and fines. @YousufNazar @AsadAToor pic.twitter.com/L53WkjFUEr
— Zohar Amin (@ZoharAmin2) August 25, 2024
నటాషా దానిష్ .. కరాచీలో పుట్టింది. ఆమెకు 32 ఏళ్లు ఉన్నాయి. డానిష్ ఇక్బాల్ భార్యే నటాషా. పాకిస్తాన్లో ప్రముఖ వ్యాపారిగా ఆయనకు గుర్తింపు ఉన్నది. గుల్ అహ్మద్ ఎనర్జీ సంస్థకు చైర్మెన్‌గా ఉన్నారు. కరాచీలోని కేడీఏ స్కీమ్ -1 ఏరియాలో వాళ్లకు నివాసం ఉన్నది. ఆమె మానసికంగా స్థిరంగా లేనట్లు ఆమె తరపు లాయర్ తెలిపారు. ఆమె చర్యలపై అవగాహన లేదని లాయర్ పేర్కొన్నారు. 14 రోజుల జుడిషియల్ రిమాండ్ కింద ఆమెను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
Shameless woman Natasha Iqbal killed a father & his daughter on road, is the wife of Danish Iqbal, current Chairman of Gul Ahmed Energy Limited.
Two killed, four injured in accident at Karachi’s Karsaz Road pic.twitter.com/BJ2DNPK55k
— Sumit (@SumitHansd) August 21, 2024