ఫొటోను చూసి అవతార్ సినిమాలో పాండోరా గ్రహం అనుకొంటున్నారా? కానేకాదు. చైనాలోని గాంగ్సీ జువాంగ్ అనే ప్రాంతంలో ఓ అడవిని ఇటీవల పరిశోధకులు గుర్తించారు.
ఆ అడవి 630 అడుగుల లోతైన ఓ బిలంలో ఉన్నది. 131 అడుగుల పొడవైన చెట్లతో దట్టంగా ఉన్న ఆ అరణ్యం.. అంత లోతున ఎలా పెరిగిందన్నది ఓ మిస్టరీగా మారింది.