న్యూయార్క్: అంతరిక్ష పర్యాటకుడు డెన్నిస్ టిటో తన భార్య అకికోతో కలిసి చంద్రుడిని చుట్టి వచ్చేందుకు ప్లాన్ రెఢీ చేశాడు. స్పేస్ఎక్స్ చేపడుతున్న మూన్ జర్నీ కోసం డెన్నిస్ టిటో అప్పుడే సీటు బుక్ చేసుకున్నారు. 2001లో 20 మిలియన్ల డాలర్లు చెల్లించిన అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చిన టిటో .. భవిష్యుత్తులో ఎలన్ మస్క్ స్టార్‌షిప్‌లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత 20 ఏళ్ల నుంచి మూన్ మీదకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నానని, అందుకే స్పేస్ఎక్స్ జర్నీ కోసం టికెట్ బుక్ చేసుకున్నట్లు టిటో తెలిపారు. చంద్రుడి మీదకు వెళ్లే జర్నీ కోసం సీటు బుక్ చేసుకున్న తొలి జంట వీరిదే. వీరితో పాటు మరో పదిమంది ప్రయాణికులు స్పేస్ఎక్స్లో మూన్ జర్నీ చేయనున్నారు. మూన్ మీదకు వెళ్లే రాకెట్‌కు ప్రస్తుతం స్పేస్ఎక్స్ సంస్థ టెస్టింగ్ చేస్తోంది.