Dennis Austin | వాషింగ్టన్,సెప్టెంబర్ 10: ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ సాఫ్ట్వేర్ రూపకర్తల్లో ఒకరైన డెన్నిస్ ఆస్టిన్ (76) అమెరికాలో కన్నుమూశారు. ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, సెప్టెంబర్ 1న కాలిఫోర్నియాలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారని ఆస్టిన్ కుమారుడు మైఖేల్ ఆస్టిన్ తాజాగా మీడియాకు తెలిపారు.
ఎంఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన డెన్నిస్ ఆస్టిన్, ఫోర్‌థాట్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ‘పవర్ పాయింట్’ను సృష్టించటంలో ముఖ్య భూమిక వహించారు. సాఫ్ట్వేర్ 1987లో విడుదల కాగా, కొద్ది నెలల తర్వాత మైక్రోసాఫ్ట్ 14 మిలియన్ డాలర్లు (సుమారు రూ.116 కోట్లు) చెల్లించి ‘ఫోర్‌థాట్’ను కైవసం చేసుకుంది.