బర్మింగ్హామ్: మనం జీవితంలో మూడో వంతు నిద్రలోనే గడుపుతాం. నిద్రపోయే పావువంతు సమయం కలలు కంటాం. అయితే, కలలే కదా అని తక్కువ అంచనా వేస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ కలలకూ మెదడు ఆరోగ్యానికి సంబంధం ఉంటుందని బర్మింగ్హామ్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
కలలు కూడా మన జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయని పరిశోధకులు గుర్తించారు. పీడ కలలు కంటున్నవారికి భవిష్యత్తులో డెమెన్షియా (చిత్తవైకల్యం) ముప్పు పొంచి ఉందని తేల్చారు. డెమెన్షియాతో మెదడు పనితీరు దెబ్బతింటుంది.