హనోయి: నిజంగా ఇదొక అద్భుతం. ఏకంగా 12వ అంతస్తు నుంచి పడిన ఓ చిన్నారిని కింద ఉన్న ఓ డెలివరీ బాయ్ ఒడిసి పట్టుకున్నాడు. దీంతో ఓ చిన్న గాయంతో ఆ చిన్నారి బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి ఒళ్లు జలదరించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వియత్నాంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. బాల్కనీలో ఆడుకుంటున్న ఆ చిన్నారి ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. అదే సమయంలో అక్కడికి ఓ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఎన్గుయెన్ మన్ అనే వ్యక్తి వచ్చాడు. అప్పటికి కాసేపటి ముందు నుంచే అతనికి ఆ చిన్నారి ఏడుపు వినిపించింది. చుట్టూ ఉన్న వాళ్ల అరుపులు కూడా వినిపించడంతో అతడు తన ట్రక్ నుంచి బయటకు దిగి చూడగా.. ఆ చిన్నారి బాల్కనీలో కనిపించింది. ఆమె కింద పడే లోపే ఆ బిల్డింగ్ బయట ఉన్న ఆరు అడుగుల ఎత్తు గోడ ఎక్కేశాడు. అయితే చివరి క్షణంలో అతని కాలు జారడంతో కింద పడబోయినా ఎలాగోలా ఆ చిన్నారిని పట్టుకోగలిగాడు. దీంతో ఆ పాప కాలికి చిన్న గాయం కాగా ఆమెను పట్టుకున్న ఎన్గుయెన్ చేతిలో ఎముక కాస్త విరిగింది. అయితే ఆ పాపను రక్షించిన అతడు ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. తాను హీరోను కాదని, మంచి చేయడమే తన పని అని ఆ తర్వాత ఎన్గుయెన్ చెప్పాడు.
😱¡HEROICA ATRAPADA!👏
— Unicanal (@Unicanal) March 1, 2021
Un repartidor le salvó la vida a una niña de 3 años que cayó del piso 12 de un edificio en Vietnam.
La nena sufrió fracturas en la pierna y en los brazos, pero está viva gracias a la heroica acción de Nguyen Ngoc Manh❤️, quien sufrió un esguince.#VIRAL pic.twitter.com/eI03quT0IM