Harvard funding | అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి (Harvard University) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్ నిధులను (Harvard funding) నిలిపివేశారు. నిధుల నిలిపివేతపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా స్పందించింది. ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం తమను ఎన్నిరకాలుగా అణచివేయడానికి ప్రయత్నించినా పోరాడుతూనే ఉంటామని తెలిపింది. ప్రభుత్వం తీసుకునే చట్టవిరుద్ధ చర్యలను వ్యతిరేకిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది.
అడ్మిషన్ విధానాలు, ఆడిట్, కొన్ని స్టూడెంట్ క్లబ్‌ల గుర్తింపు రద్దు వంటి సంస్కరణలు చేపట్టాలని ట్రంప్ సర్కార్ కోరగా.. అందుకు వర్సిటీ స్పందించలేదు. ప్రభుత్వానికి లొంగేది లేదని స్పష్టం చేసింది. తమ స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడలేమని పేర్కొంది. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని.. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని కోరింది. దీంతో హార్వర్డ్‌పై ట్రంప్ పలు ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ మధ్యలోనే ట్రంప్ ప్రభుత్వం ఆ వర్సిటీకి అందాల్సిన 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను స్తంభింపజేసింది. మొత్తం 9 బిలియన్ డాలర్ల నిధులపై సమీక్ష జరుగుతోందని అప్పట్లో తెలిపింది.
తాజాగా ఆ విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్ నిధులను (Harvard funding) నిలిపివేసింది. ప్రభుత్వ డిమాండ్లను నెరవేర్చే వరకు హార్వర్డ్‌కు ఎటువంటి కొత్త గ్రాంట్లు మంజూరుచేయబోమని స్పష్టం చేశారు. ఫెడరల్ పరిశోధన గ్రాంట్లకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. యూనివర్సిటీ ట్యూషన్ ఫీజులను చెల్లించడానికి విద్యార్థులకు సహాయపడే ఫెడరల్ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్యాశాఖ విద్యాశాఖ వెల్లడించింది.
Also Read..
Harvard funding | హార్వర్డ్ వర్సిటీకి ట్రంప్ సర్కార్ గట్టి షాక్.. ఫెడరల్ నిధులు నిలిపివేత
UN Security Council: లష్కరే పాత్ర ఉందా? పాకిస్థాన్‌ను నిలదీసిన యూఎన్ భద్రతా మండలి
Khalistanis | హిందువులను కెనడా నుంచి పంపేయండి.. ఖలిస్థానీల విష ప్రచారం