Harvard funding | హార్వర్డ్ వర్సిటీకి ట్రంప్ సర్కార్ గట్టి షాక్.. ఫెడరల్ నిధులు నిలిపివేత
Harvard funding | అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి (Harvard University) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గట్టి షాక్ ఇచ్చారు.
Harvard funding | అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి (Harvard University) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గట్టి షాక్ ఇచ్చారు. ఆ విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్ నిధులను (Harvard funding) నిలిపివేశారు. అమెరికా ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మాన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రభుత్వ డిమాండ్లను పాటించడం లేదనే కారణంతో ట్రంప్ సర్కార్ (Trump administration) ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డిమాండ్లను నెరవేర్చే వరకు హార్వర్డ్‌కు ఎటువంటి కొత్త గ్రాంట్లు మంజూరుచేయబోమని స్పష్టం చేశారు. ఫెడరల్ పరిశోధన గ్రాంట్లకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. యూనివర్సిటీ ట్యూషన్ ఫీజులను చెల్లించడానికి విద్యార్థులకు సహాయపడే ఫెడరల్ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్యాశాఖ విద్యాశాఖ వెల్లడించింది.
కాగా, అడ్మిషన్ విధానాలు, ఆడిట్, కొన్ని స్టూడెంట్ క్లబ్‌ల గుర్తింపు రద్దు వంటి సంస్కరణలు చేపట్టాలని ట్రంప్ సర్కార్ కోరగా.. అందుకు వర్సిటీ స్పందించలేదు. ప్రభుత్వానికి లొంగేది లేదని స్పష్టం చేసింది. దీంతో హార్వర్డ్‌పై ట్రంప్ పలు ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ మధ్యలోనే ట్రంప్ ప్రభుత్వం ఆ వర్సిటీకి అందాల్సిన 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను స్తంభింపజేసింది. మొత్తం 9 బిలియన్ డాలర్ల నిధులపై సమీక్ష జరుగుతోందని అప్పట్లో తెలిపింది. తాజా లేఖతో భవిష్యత్తులో హార్వర్డ్‌కు ఎలాంటి కొత్త గ్రాంట్లు అందవని మెక్‌మాన్ తేల్చి చెప్పారు.
Also Read..
UN Security Council: లష్కరే పాత్ర ఉందా? పాకిస్థాన్‌ను నిలదీసిన యూఎన్ భద్రతా మండలి
Khalistanis | హిందువులను కెనడా నుంచి పంపేయండి.. ఖలిస్థానీల విష ప్రచారం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

