అంకారా, సెప్టెంబర్ 11: సిగరెట్లు మానేందుకు ఈ-సిగరెట్లను అలవాటు చేసుకున్నవారిని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ-సిగరెట్లు వాడకం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని తు ర్కియే శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ-సిగరెట్ల వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని హెచ్చరించారు. దీంతో పాటు వృషణాల పరిమాణం కూడా తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు.
ఈ మేరకు ఎలుకలపై చేసిన పరిశోధనల ఫలితాలను వారు విడుదల చేశారు. ఈ-సిగరెట్ ద్వారా వెలువడిన పొగ ప్రభావానికి గురైన ఎలుకల ఒక మిల్లీలీటర్ వీర్యంలో 95.1 మిలియన్ల వీర్య కణాలే ఉన్నాయని, అదే సమయంలో పొగాకు పదార్థాల ప్రభావానికి లోనుకాని ఎలుకల వీర్యంలో 98.5 మిలియన్ల వీర్య కణాలు ఉన్నట్టు వారు గుర్తించారు.