Houthi Rebels | దుబాయ్: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న క్రమంలో హమాస్‌కు మద్దతుగా ఎర్రసముద్రంలో నౌకలపై హౌతీ రెబల్స్ జరుపుతున్న దాడుల్లో తొలిసారిగా మరణాలు సంభవించాయి. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో బార్బడోస్‌కు చెందిన ట్రూ కాన్ఫిడెన్స్ అనే వాణిజ్య నౌకపై హౌతీలు జరిపిన దాడుల్లో ఇద్దరు మరణించినట్టు సమాచారం.
మరో ఆరుగురు గాయపడినట్టు తెలిసింది. నౌకలోని ఇతర సిబ్బంది నౌకను వదిలేసి లైఫ్ బోట్లలో పారిపోయారు. అంతకుముందు తమ నౌకలపై హౌతీలు ప్రయోగించిన డ్రోన్స్, మిస్సైల్స్‌ను యూఎస్ డిస్ట్రాయర్ కూల్చివేసింది.