e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home News యూరోప్‌లో వ‌ర‌ద‌లు.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య‌

యూరోప్‌లో వ‌ర‌ద‌లు.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య‌

యూరోప్‌లో వ‌ర‌ద‌లు.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య‌

బెర్లిన్ : యూరోప్‌లో భారీ వ‌ర్షాల వ‌ల్ల అక‌స్మాత్తుగా వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌తో సుమారు 153 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు తెలిపారు. జ‌ర్మ‌నీలోనే క‌నీసం 133 మంది ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ జ‌ర్మ‌నీలో వ‌ర‌ద‌ల ధాటికి ఇండ్లు కొట్టుకుపోయాయి. బెల్జియం, ల‌గ్జంబ‌ర్గ్‌, నెద‌ర్లాండ్స్ దేశాల్లోనూ .. వీధుల‌న్నీ బుర‌ద‌లో మునిగిపోయాయి. అనేక కాల‌నీల‌తో సంబంధాలు తెగిపోయాయి. అయితే జ‌ర్మ‌నీలో మ‌రణాల సంఖ్య అధికంగా ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. సెల్లార్ల‌లో శ‌వాలు మ‌రిన్ని బ‌య‌ట‌ప‌డే ఛాన్సు ఉంద‌న్నారు. మ‌ట్టి, బుర‌ద‌తో నిండిపోయిన గ్రామాల‌ను క్లీన్ చేసేందుకు సైనిక ద‌ళాలు, ఫైర్‌ఫైట‌ర్లు రంగంలోకి దిగాయి. నార్త్ రైణ్ వెస్ట్‌ఫాలియా, రైన్‌ల్యాండ్‌-ప‌లాటినేట్ ప్రాంతాల్లో వ‌ర్షాలు విల‌యం సృష్టించాయి. సుర‌క్షితం ప్రాంతాల‌కు వెళ్లిన వారు ఇప్పుడిప్పుడే స్వంత ఊళ్ల‌కు చేరుకుంటున్నారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యూరోప్‌లో వ‌ర‌ద‌లు.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య‌
యూరోప్‌లో వ‌ర‌ద‌లు.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య‌
యూరోప్‌లో వ‌ర‌ద‌లు.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య‌

ట్రెండింగ్‌

Advertisement