సావో పౌలో: బ్రెజిల్(Brzial)లోని సావో పౌలో(Sao Paulo) రాష్ట్రంలో ఆకస్మిక వరదలు(sudden floods) సంభవించాయి. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 36 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. డజన్ల సంఖ్యలో జనం ఆచూకీలేకండాపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మట్టి గుట్టల్లో చిక్కుకున్న వారిని తొలగించే ప్రయత్నాలు సాగుతున్నాయి. వరదల వల్ల అనేక నగరాల్లో కార్నివాల్ వేడుకల్ని రద్దు చేశారు. కోస్టల్ పట్టణం సావో సెబాస్టియోలో గత 24 గంటల్లో 627 మిమీటర్ల వర్షం కురిసింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆ నగర మేయర్ తెలిపారు. 50 ఇండ్లకుపైగా వరదల్లో కొట్టుకుపోయినట్లు చెప్పారు. సాంటోస్ నగరంలో ఉన్న పోర్టును మూసివేశారు. బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో పోర్టును బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనేక ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు ఉండనున్నట్లు వెదర్ శాఖ తెలిపింది.