మంగళవారం 31 మార్చి 2020
International - Jan 31, 2020 , 15:11:21

క‌రోనా వైర‌స్‌.. వుహాన్ వీధిలో శ‌వం

క‌రోనా వైర‌స్‌.. వుహాన్ వీధిలో శ‌వం

హైద‌రాబాద్‌: వుహాన్ న‌గ‌రం కేంద్రంగా క‌రోనా వైర‌స్.. చైనాలో వ్యాప్తి చెందుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ న‌గ‌రంలోని ఓ వీధి నిర్మానుషంగా మారిపోయిది. అక్క‌డ వీధిలో ఉన్న పేవ్‌మెంట్‌పై ఓ మ‌నిషి చ‌నిపోయి ఉన్నాడు.  ఓ చేతిలో ప్లాస్టిక్ క‌వ‌ర్ ప‌ట్టుకుని, మూతికి మాస్క్ క‌ట్టుకుని ఉన్న ఆ వ్య‌క్తి.. వీధిలో శ‌వ‌మై క‌నిపించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. సుమారు కోటిన్న‌ర జ‌నాభాతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆ సిటీ ఇప్పుడు నిర్మానుషంగా మారింది.  క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఆ వ్య‌క్తి మృతిచెంది ఉంటాడ‌ని అనుమానాలు క‌లుగుతున్నాయి. వీధిలో చ‌నిపోయిన వ్య‌క్తిని మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ వాహ‌నంలో తీసుకువెళ్లారు.  అక్క‌డ ఉన్న కొంద‌రు ఆ దృశ్యాన్ని చూశారు. కానీ ఏమీ చేయ‌లేని స్థితిలో ఉండిపోయారు. 


logo
>>>>>>