David Warner | ప్రపంచమంతా ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించే మాట్లాడుకుంటోంది. కానీ.. మరోవైపు ఆస్ట్రేలియాను భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో ఆస్ట్రేలియా మొత్తం వరదల్లో చిక్కుకుంది. అతి భయంకరమైన వరదలు ఆస్ట్రేలియాను చుట్టుముట్టాయని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆస్ట్రేలియాలో ఇంతలా భారీ వరదలు చుట్టుముట్టాయా అని షాక్ అవుతున్నారు.
ఆస్ట్రేలియాలోని సౌత్ఈస్ట్ కోస్ట్ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల భారీ వరదలు ముంచెత్తడంతో వేల మంది ప్రజలను అక్కడి నుంచి అధికారులు తరలించారు. గత కొన్ని దశాబ్దాల నుంచి ఇటువంటి వరదలు ఆస్ట్రేలియాను ముంచెత్తిన దాఖలాలు లేవు. డేవిడ్ వార్నర్ ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోలను చూస్తేనే అర్థం అవుతుంది.. వరదల తీవ్రత ఎంత ఉందో.
ప్రస్తుతం డేవిడ్ పాకిస్థాన్లో ఉన్నాడు. పాక్తో సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు పాకిస్థాన్ వెళ్లారు. పాకిస్థాన్ సిరీస్ పూర్తవగానే డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2022 కోసం భారత్ రానున్నాడు.