న్యూయార్క్: కొన్ని రోజుల క్రితం అమెరికాలో వేల సంఖ్యలో విమానాలు స్తంభించిపోయిన విషయం తె లిసిందే. అయితే ఆ గందరగోళ పరిస్థితికి దారి తీసిన పరిణామాలపై ఫెడరల్ ఏవియేషన్ సంస్థ ప్రకట చేసింది. విమానయాన సంస్థకు చెందిన డేటా ఫైల్ డ్యామేజ్ కావడం వల్ల వేల సంఖ్యలో విమానాలు గ్రౌండ్ అయినట్లు ఎఫ్ఏఏ పేర్కొన్నది. కంప్యూటర్ ఫెయిల్ కావడం వల్ల డేటా ఫైల్ డ్యామేజ్ అయ్యిందని, దాని వల్ల ఆ విపత్తు వచ్చినట్లు ఎఫ్ఏఏ తెలిపింది.
ఫైల్ కరప్ట్ కావడానికి ఓ వ్యక్తి కారణమని, ఆ వ్యక్తి వల్ల ఎఫ్ఏఏ కంప్యూటర్ సిస్టమ్ పనిచేయలేదని, ఆ కారణంగా పైలెట్లకు సేఫ్టీ నోటీసులు వెళ్లలేదని ఎఫ్ఏఏ పేర్కొన్నది. ప్రస్తుతం ఆ సిస్టమ్ బాగానే పనిచేస్తుందని, విమానాలు ఇప్పుడు ఒక శాతం కన్నా తక్కువే రద్దు అయినట్లు ఏజెన్సీ తెలిపింది. కాంట్రాక్టర్ కోసం పనిచేస్తున్న ఇద్దరి వల్ల ఆ సమస్య ఉత్పన్నం అయినట్లు భావిస్తున్నారు. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ సిస్టమ్‌లోని కోర్ డేటాలోకి స్పామ్ పంపడం వల్ల ఇలా జరిగినట్లు అంచనా వేస్తున్నారు.