వాషింగ్టన్ : చాట్‌జీపీటీ సృష్టికర్త తాను సృష్టించినదాని గురించి హెచ్చరించారు. ఈ చాట్‌బాట్‌ను సృష్టించిన ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఇప్పుడు హెడ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ పదవిని భర్తీ చేయడానికి తగిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు.
ఏఐ సిస్టమ్స్ నుంచి నిజమైన సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించడానికి హెడ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ పని చేయవలసి ఉంటుందని చెప్తున్నారు. ఆల్ట్‌మన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏఐ సిస్టమ్స్ అత్యాధునికంగా మారాయి. అవి ముఖ్యమైన భద్రతాపరమైన బలహీనతలను గుర్తిస్తున్నాయి. యూజర్స్ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.