లండన్, జనవరి 1: పొగ తాగే అలవాటు మానుకోవాలనుకొనేవారికి శుభవార్త! ధూమపానం వ్యసనం నుంచి విముక్తి పొందాలనుకొనే వారి కోసం లాబర్నమ్ చెట్ల నుంచి సహజ సిద్ధంగా తయారుచేసిన సిటిసైన్ మందు బిళ్లలు ఇంగ్లండ్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మందు బిళ్లలను మధ్య, తూర్పు యూరప్‌లలో దశాబ్దాలుగా వాడుతున్నారు. అర్జెంటీనా పరిశోధకుల ప్రకారం నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ కంటే సిటిసైన్ మందులు సమర్థంగా పనిచేస్తాయి. యాదృచ్ఛికంగా నిర్వహించిన 12 ట్రయ్సల్లో ఈ విషయం తేలింది. ఇవి చౌకైన మందులని.. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం మానేయాలనుకొనేవారికి ఎంతో ఉపకరిస్తాయని వారు తెలిపారు.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తాజా పరిశోధనల ప్రకారం ఈ-సిగరెట్లు, వరెనిైక్లెన్ మందులతో పాటు సిటిసైన్ మందులు ధూమపానం అలవాటును మానేయడానికి బాగా దోహదం చేస్తాయి. ప్లాసిబో విధానంతో పోలిస్తే సిటిసైన్ బిళ్లలు ధూమపానం మానేయడంలో రెండింతలు సమర్థంగా పనిచేస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. సిటిసైన్ పిల్స్ ఈ నెలాఖరు నుంచి యూకే మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే 25 రోజుల కోర్సుల మందుల ధర 115 పౌండ్లు ఉండొచ్చని చెప్తున్నారు. ఈ పరిశోధన వివరాలు అడిక్షన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.