జంతురాజ్యం భలే అందంగా ఉంటుంది. కొన్ని జంతువుల చేష్టలు భలే నవ్వు తెప్పిస్తుంటాయి. మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందుకే జంతువుల హృదయపూర్వకమైన వీడియోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం ఓ చిన్న కుందేలు వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటున్నది. ఆకులను ముద్దుముద్దుగా తింటున్న కుందేలు వీడియోకు అందరూ ఫిదా అవుతున్నారు.
ఈ వీడియోను వైల్డ్యానిమల్స్ అనే యూజర్ ట్విటర్లో షేర్చేశారు. ఈ వీడియోలో అందమైన చిట్టి కుందేలు వరండాలో కూర్చుని మొక్క ఆకులను తింటోంది. ఈ వీడియో చాలా మనోహరంగా ఉండడంతో నెటిజన్లను కట్టిపడేస్తున్నది. ఇప్పటివరకూ వీడియోకు 7.3 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ఈ కుందేలు వీడియో తమకు ఆహ్లాదాన్ని కలిగించిందని, తమకూ ఇలాంటి కుందేలు కావాలంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.
Little bunny 🐰💖#CuteAnimals pic.twitter.com/JuEYhOlMoM
— 🐩wildAnimals🐎 (@Animals10wild1) July 9, 2022