ఫొటోను చూసి.. ఎవరో చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన పెయింటింగ్ అని అనుకుంటున్నారా?! మీరు చూస్తున్నది బృహస్పతి గ్రహం ఉపరితలం. ఇటీవల అక్కడి పెద్ద పెద్ద తుఫానులు ఏర్పడ్డాయి. ఎంతలా అంటే ఒక్కొక్కటి 50 కిలోమీటర్ల ఎత్తువరకూ ఎగిసిపడింది. అక్కడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న జూనో స్పేస్‌క్రాఫ్ట్ ఈ అరుదైన దృశ్యాలను కెమెరాతో బంధించింది. వీటిని నాసా తాజాగా విడుదల చేసింది.