హవానా: క్యూబా(Cuba) గాఢాందకారంలోకి వెళ్లింది. విద్యుత్తు ప్లాంట్ విఫలం కావడంతో.. దేశవ్యాప్తంగా చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో ఆ దేశంలోని కోటి మంది జనాభా పరిస్థితి అయోమయంగా మారింది. శుక్రవారం పవర్ గ్రిడ్ కుప్పకూలినట్లు అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని ఇంధన శాఖ మంత్రి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మళ్లీ విద్యుత్తును పునరుద్దరించేందుకు ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని గ్రిడ్ అధికారులు చెప్పారు. ఇటీవల గత కొన్ని నెలల నుంచి క్యూబాలో అడపాదడపా విద్యుత్తు సరఫరా నిలిచిపోతున్నది. దీంతో ప్రధాని ఎనర్జీ ఎమర్జెన్సీ ప్రకటించారు.