కాన్బెర్రా: మేజెస్టిక్ ప్రిన్సెన్ క్రూజ్ నౌకలో 800 మంది ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో నౌకను నిలిపివేశారు. దిగేందుకు ప్రయాణికులకు అనుమతి ఇచ్చిన అధికారులు.. ప్రజా రవాణాకు దూరంగా ఉండాలని సూచించారు. 4,600 మంది ప్రయాణికులు, సిబ్బందితో న్యూజిలాండ్ నుంచి ఈ నౌక బయలుదేరింది. 12 రోజుల సముద్రయానంలో భాగంగా సగం ప్రయాణంలోనే పెద్ద సంఖ్యలో కొవిడ్ కేసులు బయటపడినట్టు నౌక అధికారులు తెలిపారు. బాధితుల్లో కొందరికి స్వల్ప లక్షణాలు ఉండగా, చాలామందికి అవి కనిపించడం లేదని పేర్కొన్నారు.