Costa Rican Soccer | కోస్టారికాలో దారుణం చోటుచేసుకుంది. 29 ఏండ్ల సాకర్ ఆటగాడు జీసస్ ఆల్బర్టో లొపేజ్ ఒర్టిజ్ పై నదిలో మొసలి దాడి చేసింది. అతడ్ని నీళ్లలోకి లాకెళ్లడంతో మరణించాడని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ దాడిలో నీట మునిగి మరణించాడా, మొసలి దాడి వల్ల ప్రాణాలు కోల్పోయాడా? అన్న సంగతి తెలియలేదు. కనాస్ నది మొసళ్లకు ప్రసిద్ధి తెలిసి కూడా ఫిషింగ్ బ్రిడ్జి సమీపాన ఎక్సర్సైజులు చేస్తున్నాడు.
జీసస్ ఆల్బర్టో లొపేజ్ ఒర్టిజ్ను మొసలి లాక్కెళ్తున్న భయానక ద్రుశ్యాలను చూసిన ప్రత్యక్ష సాక్షులు అక్కడి నుంచి పారిపోయారు. కోస్టారికా రాజధాని శాన్ జోస్ కు 140 మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఓర్టిజ్.. డిపోర్టివోరియో కనాస్ అమెచ్యూర్ సాకర్ క్లబ్ సభ్యుడు. కోస్టారికా అస్కెన్సో లీగ్ టీం సభ్యుడు కూడా. ఒర్టిజ్ మరణాన్ని టీం యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. ఇదిలా ఉంటే, జీసస్ ఆల్బర్టో లొపేజ్ ఒర్టిజ్ కోసం వెతికించామని రెడ్ క్రాస్ తెలిపింది. మొసలిని చంపేందుకు పోలీసులు తుపాకులు కూడా పేల్చారని పేర్కొంది.