Crime news : అతని వయస్సు 54 ఏళ్లు. పేరు ఆంథోని స్టాక్స్. బాలిక వయస్సు 13 ఏళ్లు. అతను మాయమాటలు చెప్పి బాలికను లొంగదీసుకున్నాడు. ఈ వ్యవహారం బాలిక పదేళ్ల తమ్ముడి కంటపడింది. ఇంతటితో ఈ వ్యవహారం ఆపేయాలని, లేదంటే అమ్మకు చెబుతానని ఆ బాలుడు బెదిరించాడు. దాంతో బాలుడిపై కక్ష పెంచుకున్న స్టాక్స్ అతడిని ఓ శిఖరంపైకి తీసుకెళ్లి లోయలోకి తోసేశాడు.
కిందపడ్డ బాలుడిని చూసి చుట్టూ స్థానికులు గుమిగూడారు. ఈ క్రమంలో నిందితుడు కూడా ఏమీ ఎరుగనట్లుగా అక్కడికి వెళ్లి వాళ్లలో కలిశాడు. అనంతరం స్థానికులు తీవ్రంగా గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు.. బాలుడు ప్రమాదవశాత్తు జారిపడినట్లుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్రిటన్లో 2022 సెప్టెంబర్లో ఈ ఘటన చోటుచేసుకోగా.. దాదాపు ఏడాదిన్నర తర్వాత నిజం బయటికి వచ్చింది.
ఏడాదిన్నరగా కేసు విచారణ జరుపుతున్న పోలీసులకు బాలికతో ఆంథోనీ స్టాక్స్ ఉన్న ఎఫైర్ గురించి తెలిసింది. కేసు కీలక మలుపు తిరిగింది. దాంతో ప్రమాదం కేసును హత్యాయత్నం కేసుగా మార్చారు. కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ప్రమాదంలో గాయపడ్డ బాలుడు కోలుకున్నప్పటికీ గతం మర్చిపోవడంతో నేరం రుజువు చేయడంలో ఆలస్యం జరుగుతోంది.
తాను నేరానికి పాల్పడలేదని ఆంథోని స్టాక్స్ చెబుతున్నాడు. తన దగ్గర పనిచేసే మెంటల్ హెల్త్ వర్కర్, సదరు బాలిక పెళ్లి చేసుకోవాలనున్నారని, ఆ విషయంలో తాను బాలికను కలిశానని నిందితుడు కథ అల్లాడు. బాలుడికి గతం గుర్తవస్తే తప్ప నిందితుడికి శిక్ష పడే అవకాశం లేదు.