ముంబై: క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు తనను ఆహ్వానించలేదని మహారాష్ట్ర(Maharastra)లోని ఓ మున్సిపల్ నేత వికృతంగా ప్రవర్తించాడు. ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్లోకి ప్రవేశించి.. ట్రాక్టర్‌తో పిచ్‌ను మొత్తం ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు చెందిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 12వ తేదీన ఈ ఘటన జరిగింది. ధరాన్గావ్లో ఇటీవల ఎమ్మెల్యే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ముంబైకి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణంలో ఆ టోర్నమెంట్ నిర్వహించారు.
అయితే ఆ టోర్నీ నిర్వహకులు ఫైనల్ మ్యాచ్‌కు తనను ఆహ్వానించలేదన్న కోపంతో.. ధరాన్గావ్ మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ట్రాక్టర్‌తో బీభత్సం సృష్టించాడు. ఫైనల్‌కు పిలవలేదన్న ఆవేశంతో.. పిచ్‌ను ధ్వంసం చేశాడు. ట్రాక్టర్ తీసుకువచ్చి మైదానాన్ని పొక్కిలి పొక్కిలి చేశాడు. గ్రౌండ్‌ను ఆడటానికి వీలులేకుండా చేశాడు.
క్రికెటర్లు, నిర్వాహకులు, ప్రేక్షకులు మున్సిపల్ ప్రెసిడెంట్ చర్యను చూసి షాకయ్యారు. అయితే ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు.
Tractor Driver plows the cricket pitch mid-final in Jalgaon after the driver wasn’t invited to the tournament 😭 pic.twitter.com/iDZ5hcMDbh
— Amitabh Chaudhary (@MithilaWaaala) April 19, 2026