Covid-19 ఎఫెక్ట్.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారీగా తగ్గిన ఆయుర్దాయం
కరోనా ( Covid-19 ) మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తోందో మనం చూస్తేనే ఉన్నాం. దీని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందికిపైగా మృత్యువాత పడ్డారు.

న్యూఢిల్లీ: కరోనా ( Covid-19 ) మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తోందో మనం చూస్తేనే ఉన్నాం. దీని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందికిపైగా మృత్యువాత పడ్డారు. దీంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనుషుల సగటు ఆయుర్దాయం కొవిడ్ కారణంగా భారీగా తగ్గినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసిన తాజా సర్వేలో వెల్లడైంది. అమెరికా ప్రజల సగటు ఆయుర్దాయం 2020లో రెండేళ్లు తగ్గినట్లు ఈ సర్వేలో తేలింది.
29 దేశాల్లో అధ్యయనం
ఈ అధ్యయనాన్ని 29 దేశాల్లో నిర్వహించారు. యూరప్‌తోపాటు అమెరికా, చిలీ దేశాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఈ 29 దేశాల్లో 22 దేశాల ప్రజల ఆయుర్దాయం 2019తో పోలిస్తే ఆరు నెలల మేర తగ్గినట్లు గుర్తించారు. ఈ దేశాల్లో అధికారిక కొవిడ్ మృతుల సంఖ్య కారణంగానే ఆయుర్దాయం తగ్గినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం అంచనా వేసింది. కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందికిపైగా మరణించారు. కరోనా వివిధ దేశాల్లో సృష్టించిన విధ్వంసానికి ఇది నిదర్శనమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ రిద్ధీ కశ్యప్ అన్నారు.
పురుషుల్లోనే ఎక్కువ
అధ్యయనం నిర్వహించిన దేశాల్లో మహిళలతో పోలిస్తే.. పురుషుల ఆయుర్దాయమే ఎక్కువగా తగ్గినట్లు తేలింది. అమెరికా పురుషుల ఆయుర్దాయం 2.2 ఏళ్ల మేర తగ్గినట్లు గుర్తించారు. 15 దేశాల్లో పురుషుల ఆయుర్దాయం ఎక్కువగా తగ్గిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. 11 దేశాల్లో మాత్రం పురుషుల కంటే మహిళల ఆయుర్దాయం తగ్గినట్లు గుర్తించారు. ఇక వయసు పరంగా చూసుకుంటే.. అమెరికాలో పని చేసే వయసు జనాభా అధికంగా ప్రభావితం కాగా.. యూరప్ దేశాల్లో 60 ఏళ్లకు పైబడిన వారి ఆయుర్దాయం తగ్గిందని అధ్యయనంలో తేలింది. కరోనా ప్రభావంపై మరింత స్పష్టమైన అధ్యయనం చేయడానికి ఇతర మధ్య, తక్కువ ఆదాయం గల దేశాలు తమ అధికారిక కరోనా మృతుల డేటా ఇవ్వాలని డాక్టర్ రిద్ధీ కశ్యప్ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

