న్యూయార్క్: అమెరికాలో కోవిడ్‌తో హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. న్యూజెర్సీ రాష్ట్రంలో హాస్పిటలైజేషన్ 60 శాతం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అత్యంత జన సాంద్రత కలిగిన ఆ రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో కేవలం న్యూజెర్సీ నగరంలోనే 3604 మందికి పాజిటివ్ రాగా, మరో 38 మంది కోవిడ్‌తో మరణించారు. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 27,975 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. దీంతో పలు నగరాల మేయర్లు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నివార్క్లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేవారు కచ్చితంగా వ్యాక్సినేషన్ ద్రువపత్రాన్ని చూపాల్సి ఉంటుంది. రెస్టారెంట్లు, కన్సర్ట్ వేదికల్లోనూ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాలని ఆదేశాలు జారీ చేశారు.