Boster Dose in USA above 18 | కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు మరింత భద్రత కోసం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. 18 ఏండ్లు దాటిని ప్రతి ఒక్కరికీ బూస్టర్ వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఫైజర్, మోడెర్నా బూస్టర్ డోసులకు అమెరికా ఆహార, ఔషధ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) అనుమతిచ్చింది. గతంలో 65 ఏండ్లు దాటిన వారు, తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్న వారికి మాత్రమే అమెరికాలో బూస్టర్ డోస్ వేశారు. తాజా నిర్ణయంతో కోట్ల మందికి లబ్ధి చేకూరనున్నది.
ప్రస్తుత శీతాకాలంలో కోవిడ్-19 కేసులు పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో బూస్టర్డోస్పై అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సమాచారం. అయితే, వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న ఆరు నెలలకు బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులవుతారు.
గతంలో ఏ వ్యాక్సిన్ తీసుకున్నా.. బూస్టర్ డోస్‌గా మరో వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సింగిల్ డోస్ వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకున్న వారు కూడా బూస్టర్ డోస్ తీసుకోవడానికి అర్హత ఉంది. ఇప్టపి వరకు 19.5 కోట్ల మంది రెండు డోస్‌ల వ్యాక్సిన్ వేసుకోగా, వారిలో మూడు కోట్ల మంది బూస్టర్ డోస్ వేసుకున్నారు.