స్పెయిన్లో 90 వేల కొవిడ్ మరణాలు
Spain | స్పెయిన్లో కరోనా మరణాలు 90 వేలకు చేరాయి. ఈ విషయాన్ని స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. గత శుక్రవారం నుంచి సోమవారం వరకు 202 కరోనా మరణాలు సంభవించాయని

మాడ్రిడ్ : స్పెయిన్లో కరోనా మరణాలు 90 వేలకు చేరాయి. ఈ విషయాన్ని స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. గత శుక్రవారం నుంచి సోమవారం వరకు 202 కరోనా మరణాలు సంభవించాయని తెలిపింది. కరోనా మొదటి వేవ్ నుంచి ఇప్పటి వరకు 90,136 మంది మరణించినట్లు స్పష్టం చేసింది.
72 గంటల వ్యవధిలో కొత్తగా 2,92,394 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. స్పెయిన్లో ఇప్పటి వరకు 74,57,300 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 23.58 శాతం మంది రోగులు ఇంటెన్సివ్ కేర్ లో చేరి చికిత్స పొందుతున్నారు. 13.4 శాతం మంది రోగులు సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక 5 నుంచి 16 ఏండ్ల వయసున్న 33,50,000 మందికి కరోనా టీకా వేసినట్లు తెలిపింది. కరోనా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు స్పానిష్ ప్రధాని పెడ్రో షాంచెజ్ స్థానిక మీడియాకు తెలిపారు. 3,44,000 డోసుల ఫైజర్ టీకాను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

