pet dog | పెంపుడు కుక్కకు కరోనా పాజిటివ్.. యజమాని వల్లే వైరస్ వ్యాప్తి
pet dog | కరోనా వైరస్ మనుషుల నుంచి పెంపుడు జంతువులకు వ్యాప్తిచెందుతున్నది. బ్రిటన్‌లో ఓ పెంపుడు కుక్కకు (pet dog) కరోనా వైరస్ సోకింది.

లండన్: కరోనా వైరస్ మనుషుల నుంచి పెంపుడు జంతువులకు వ్యాప్తిచెందుతున్నది. బ్రిటన్‌లో ఓ పెంపుడు కుక్కకు (pet dog) కరోనా వైరస్ సోకింది. దాని యాజమాని వల్లే ఆ శునకం కరోనా బారినపడిందని వైద్యులు వెల్లడించారు. యూకే (united kingdom)లోని వేబ్రిడ్జ్‌లో ఉన్న యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీ (APHA) ల్యాబొరేటరీ ఈ విషయాన్ని నిర్ధారించింది. ఆ కుక్కకు నవంబర్ 3న పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది. ప్రస్తుతం అది చికిత్స పొందుతున్నదని, దాని పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు.
కాగా, శునకం యజమానికి ఈ మధ్యే కరోనా వచ్చిందని, అతని నుంచే దానికి కరోనా వ్యాపించిందనడానికి ఆధారాలు లభించాయని APHA చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ క్రిస్టిన్ మైడెల్మిస్ చెప్పారు. అయితే ఆ కుక్క వల్ల ఇతర జీవులకు కరోనా వ్యాప్తిచెందినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కుక్కలకు ఇన్ఫెక్షన్ కావడం చాలా అరుదని, కొన్ని లక్షణాలు మాత్రమే కనిపిస్తాయన్నారు. కొన్ని రోజుల్లోనే అవి కోలుకుంటాయని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

