Corona is far from Over | కరోనా ఇంకా పోలేదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్
Corona is far from Over | కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని, ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

జెనీవా: కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని, ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సమీక్షా కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ టెడ్రోస్ అధానమ్ ఘెబ్రియేసస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ వారానికి 50 వేల కరోనా మరణాలు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి తగ్గిపోయిందని భావించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రపంచం కోరుకున్నప్పుడే ఈ మహమ్మారిని అంతమొందిచగలమని టెడ్రోస్ చెప్పారు. ‘మన దగ్గర కరోనాను అంతం చేయడానికి కావలసిన వనరులు ఉన్నాయి. ప్రభావవంతమైన ప్రజారోగ్య వనరులు, శక్తిమంతమైన మెడికల్ వనరులు అన్నీ ఉన్నాయి. కానీ ప్రపంచం వాటిని సరిగా ఉపయోగించుకోలేదు’ అని ఆయన పేర్కొన్నారు.
అలాగే తమ జనాభాలో 40 శాతంపైగా ప్రజలకు వ్యాక్సిన్ అందించిన జీ20 దేశాలు ఇకపై కోవ్యాక్స్‌పై దృష్టి సారించాలని కోరారు. ప్రపంచంలోని బీదదేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవ్యాక్స్ మిషన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే ఆఫ్రికా దేశాల కోసం ఆఫ్రికన్ వ్యాక్సిన్ అక్విషన్ ట్రస్ట్ (ఏవీఏటీ) అనే స్వచ్ఛంద సంస్థ కూడా వ్యాక్సిన్ సేకరణ కోసం కృషి చేస్తోంది. జీ20 దేశాలు ఈ రెండు పథకాల్లో యాక్టివ్‌గా పాలుపంచుకోవాలని టెడ్రోస్ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

