బెర్లిన్ : జర్మనీ పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్ష నేత ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని కన్జర్వేటివ్ సీడీయూ/సీఎస్‌యూ అలయన్స్దే ఆధిక్యమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 28-29 శాతం ఓట్లు దక్కవచ్చని పేర్కొన్నాయి. ఫార్ రైట్ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) ఏకంగా 19.5-20 శాతం ఓట్లు దక్కించుకోవచ్చని అంచనావేశాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన ఓట్ల కంటే ఇది రెట్టింపు. ఇక చాన్స్‌లర్ ఓలఫ్ స్కాల్జ్ సెంటర్-లెఫ్ట్ సోషల్ డెమోక్రాట్లు మూడో స్థానానికి పరిమితమవుతారని, కేవలం 16-16.5 శాతం ఓట్లు దక్కించుకోవచ్చని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.