Free condoms | ఫ్రాన్స్‌లో ఉచితంగా కండోమ్‌లు.. అవాంఛిత గర్బధారణను అరికట్టేందుకు ఈ నిర్ణయం
Free condoms | లైంగిక సంబంధ వ్యాధులు ఫ్రాన్స్‌లో పెరిగిపోతున్నాయి. దీంతో ఇక్కడ ఉచితంగా కండోమ్‌లు ఇవ్వాలని మాక్రాన్ ప్రభుత్వం నిర్ణయించింది, 18-25 ఏండ్ల వారికి ఉచితంగా కండోమ్‌లు ఇవ్వడం వల్ల అవాంచిత గర్బధారణలు కూడా అరికట్టొచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.
Free condoms | వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫ్రాన్స్‌లో యువతకు కండోమ్‌లు ఇవ్వనున్నారు. 18 నుంచి 25 ఏండ్ల వయసున్న వారికి ఉచితంగా కండోమ్‌లను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రకటించారు. ఫ్రాన్స్‌లో ఎయిడ్స్, ఇతర లైంగిక సంక్రమిత వ్యాధుల వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అలాగే, అవాంఛిత గర్బధారణను అరికట్టేందుకు కూడా ఈ
ఉచిత కండోమ్‌లు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తున్నది.
2030 నాటికి ఫ్రాన్స్‌ను హెచ్ఐవి కేసుల రహితంగా మార్చాలని ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్రాన్స్‌లో 2020-2021 లో లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ల కేసులు 30 శాతం పెరిగాయి. అయితే 2021 లో దాదాపు 5000 కొత్త హెచ్ఐవీ కేసులు నమోదవడం కలవరపెట్టే అంశం. ఇదే సమయంలో పేదరికం కారణంగా చాలా మంది యువతులు, మహిళలు అవాంఛిత గర్భాలను కొనసాగించారు. ఇప్పుడు ఉచితంగా కండోమ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దాదాపు 30 లక్షల మంది బాలికలు, మహిళలు లబ్ధి పొందనున్నారు.
గతంలో 18 ఏండ్లలోపు బాలికలకు మాత్రమే ఉచితంగా గర్బనిరోధక మందులు ఇచ్చేవారు. సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో ఫ్రాన్స్ బాగా వెనకబడి ఉన్నదని చెప్పిన మాక్రాన్.. అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫ్రాన్స్‌లో ప్రతి నలుగురిలో ఒకరు కొత్త భాగస్వామితో శృంగారంలో ఉన్నప్పుడు కండోమ్‌లను ఉపయోగించరు లేదా అరుదుగా ఉపయోగిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

