బార్సిలోనా: టీ బ్యాగ్‌లతో టీ తాగడం చాలా సౌకర్యంగా, రుచికరంగా ఉంటుంది. అయితే, వీటి వల్ల లక్షల సంఖ్యలో మైక్రో, నానోప్లాస్టిక్స్ శరీరంలోకి వెళ్తున్నట్టు స్పెయిన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనాకు చెందిన పరిశోధకులు నైలాన్-6, పాలిప్రోపిలీన్, సెల్యూలోస్ అనే పాలిమర్ల నుంచి చేసిన టీ బ్యాగులపై అధ్యయనం జరపగా వీటితో టీ కలుపుకునేటప్పుడు పెద ్దసంఖ్యలో మైక్రో, నానోప్లాస్టిక్స్ విడుదలవుతున్నట్టు గుర్తించారు.
టీ కలిపేటప్పుడు నైలాన్-6 మిల్లీలీటర్‌కు 81.8 లక్షల కణాలను, పాలిప్రోపిలీన్ 120 కోట్ల కణాలను, సెల్యూలోస్ 13.5 కోట్ల కణాలను విడుదల చేస్తున్నట్టు చెప్పారు.