Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. వెనెజువెలా సరిహద్దులో బుధవారం రాత్రి విమానం కుప్పకూలి ఆ దేశ శాసనసభ్యుడు డియోజెనెస్ క్వింటెరో సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కొలంబియా సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారికంగా వెల్లడించింది.
ప్రభుత్వ విమానయాన సంస్థ సటేనా నిర్వహిస్తున్న ఈ విమానం కుకుటాలోని విమానాశ్రయం నుంచి ఉదయం 11.42 గంటలకు (స్థానిక కాలమాన ప్రకారం) టేకాఫ్ అయ్యింది. 12.05 గంటలకు ఒకానాలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే 11.54 గంటలకు ఆ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా వెనెజువెలా సరిహద్దులోని మారుమూల ప్రాంతమైన లా ఫ్లాయా డెబెలెన్లో విమానం కుప్పకూలినట్లుగా అధికారులు నిర్ధారించారు. విమానం టేకాఫ్ అయిన 9 నిమిషాలకే ప్రమాదం జరిగిందని ఏవియేషన్ అధికారులు భావిస్తున్నారు.
నిన్న జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం పుణె జిల్లాలోని బారామతిలో కుప్పకూలింది. ఈ ఘటనలో పవార్‌తో పాటు ముంబై వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్వో) వదీప్ జావద్, విమానాన్ని నడుపుతున్న కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి మృత్యవాతపడ్డారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టు రన్‌వేకు సమీపంలో ఈ విమానం కుప్పకూలింది. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలై మంటలు చెలరేగాయి. ఘటనాస్థలిలోనే విమానంలోని వాళ్లందరూ చనిపోయారని ప్రత్యక్షసాక్షులు పేర్కొన్నారు.