Chinmoy Krishna Das : బంగ్లాదేశ్ (Bangladesh) లో ఇస్కాన్ (ISKCON) కు చెందిన చిన్మయి కృష్ణదాస్ (Chinmoy Krishna Das) బ్యాంకు ఖాతా (Bank account) ను నిలిపేశారు. చిన్మయి కృష్ణదాస్ సహా ఇస్కాన్‌కు చెందిన 17 మంది బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నట్లు బంగ్లాదేశ్ బ్యాంకులకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం (BFIU) ప్రకటించింది. నెలరోజులపాటు ఈ ఫ్రీజింగ్ అమలులో ఉంటుందని పేర్కొంది.
ఈ మేరకు బంగ్లాదేశ్‌లోని వివిధ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఆ 17 ఖాతాల్లో అన్ని రకాల లావాదేవీలను సస్పెండ్ చేసింది. అంతేగాక ఆ 17 ఖాతాలకు సంబంధించిన లావాదేవీల వివరాలతో కూడిన స్టేట్మెంట్లను మూడు రోజుల్లోగా తనకు పంపాలని ఆదేశించింది. ఇస్కాన్‌కు చెందిన చిన్మయి కృష్ణదాస్‌ను దేశద్రోహం నేరం కింద బంగ్లాదేశ్ పోలీసులు ఢాకాలోని హజరత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత సోమవారం అరెస్ట్ చేశారు.