బీజింగ్: కృతిమ మేధ(ఏఐ) రంగంలో చైనా మరో సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. చాట్‌జీపీటీని మించేలా ‘డీప్‌సీక్’ను అందుబాటులోకి తీసుకురాగా, చైనాకు చెందిన అలీబాబా సైతం ఏఐ రేసులోకి దూసుకొచ్చింది.
‘క్వెన్ 2.5-మాక్స్’ పేరుతో ఒక ఏఐ మాడల్‌ను బుధవారం షాంఘైలో ఆవిష్కరించింది. ప్రస్తుతం అందుబాటు ఉన్న ఏఐ మాడళ్లను మించి అత్యుత్తమంగా పని చేసినట్టు ప్రకటించింది.