China |చైనా మంగళవారం విజయవంతంగా షెన్‌జౌ-22 వాహకనౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఇటీవల అంతరిక్ష కేంద్రం వద్ద ఢీకొట్టిన స్పేస్‌క్రాఫ్ట్ స్థానంలో మంగళవారం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతమయ్యాక టియాంగాంగ్ (అంతరిక్ష కేంద్రం)తో షెన్‌జౌ-22 అంతరిక్ష నౌకను డాక్ చేశారు. ప్రస్తుతం స్పేస్ స్టేషన్లో ఉన్న ముగ్గురు వ్యోమగాములను తిరిగి భూమికిపైకి తీసుకురానున్నది. వాస్తవానికి నవంబర్ 14న భూమిపైకి తిరిగి వచ్చేందుకు పంపిన షెన్జౌన్-20 వ్యోమనౌక దెబ్బతిన్నది. స్పేస్షెటిల్ను అంతరిక్ష శిథిలాలు ఢీకొట్టిన సమయంలో వ్యూ విండో దెబ్బతింది. దాంతో వ్యోమగాములను భూమిపైకి తీసుకురావడాన్ని వాయిదా వేశారు. దాంతో అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోగా వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాల్సి వచ్చింది.
మంగళవారం మానవరహిత షెన్‌జౌ-22 అంతరిక్ష నౌక అంతరిక్ష ఆహారం, వైద్య సామగ్రి, తాజా పండ్లు, కూరగాయలను, అలాగే షెన్‌జౌ-20 అంతరిక్ష నౌకలో దెబ్బతిన్న విండోని మరమ్మతు చేయడానికి పరికరాలను తీసుకువెళ్లింది. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రస్తుత ముగ్గురు సభ్యుల సిబ్బందిని తిరిగి తీసుకువచ్చేందుకు ఉపయోగించున్నట్లు చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (CMSA) తెలిపింది. దెబ్బతిన్న అంతరిక్ష నౌక మరమ్మతు చేసి.. చివరికి భూమికి తిరిగి వస్తుందని పేర్కొన్నారు. షెన్‌జౌ-22 అంతరిక్ష నౌకను వాయువ్య చైనాలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్-2ఎఫ్ వై22 క్యారియర్ రాకెట్ నుంచి ప్రయోగించింది. వ్యోమనౌక ప్రయోగించిన దాదాపు 10 నిమిషాల తర్వాత.. రాకెట్ నుంచి విడిపోయి దాని ఉద్దేశించిన కక్ష్యలోకి ప్రవేశించింది. అనంతరం స్పేస్స్టేషన్తో డాక్ చేసింది. ప్రయోగ మిషన్ పూర్తిగా విజయవంతమైందని సీఎంఎస్ఏ ప్రకటించింది. చైనా తన అంతరిక్ష కార్యక్రమాన్ని తన సైన్యం నియంత్రిస్తుందనే ఆందోళనల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి మినహాయించడంతో చైనా తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంది.