Contact Lens | బీజింగ్, మే 26: చీకట్లో సైతం మనం కంటితో చూడగలిగే ‘ఇన్ఫ్రారెడ్ కాంటాక్ట్ లెన్స్’ను యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా సైంటిస్టులు తయారు చేశారు. మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ కాంటాక్ట్ లెన్స్‌ను ధరించినవాళ్లకు.. కను రెప్పలు మూసుకున్నా కండ్ల ముందున్నది కనపడుతుంది. పరారుణ కాంతి కిరణాలను దృశ్య తరంగాలుగా మార్చి కంటిలోపలికి చేర్చుతాయి కాబట్టి వీటిని ఇన్ఫ్రారెడ్ లెన్స్ (పరారుణ కటకాలు)గా పిలుస్తారు.
ఇవి కనురెప్పను దాటి కంటి లోపలికి వెళ్లగలవు. దీనివల్లే కను రెప్ప మూసినా.. ముందున్నది చూడగలుగుతారు. కొన్ని రకాల పాలిమర్స్, నానోపార్టికల్స్‌తో ఈ లెన్సెస్ను సైంటిస్టులు రూపొందించారు. ఈ టెక్నాలజీని దట్టమైన పొగమంచు, దుమ్ముతో కూడిన వాతావరణం, రక్షణ, అత్యవసర సమయాల్లో వాడొచ్చునని అధ్యయనం పేర్కొన్నది. తొలుత ఎలుకలపై చేసిన ప్రయోగాలు ఫలితాల్ని ఇవ్వటంతో మానవులపైనా ట్రయల్స్ నిర్వహించినట్టు పరిశోధకులు తెలిపారు.