బీజింగ్: ఆస్టియోఆర్థరైటిస్తో పాటు సాధారణ ఆర్థరైటిస్(Arthritis) వ్యాధి చికిత్సకు మందును కనుగొన్నట్లు చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలి దశలో ఆర్థరైటిస్‌ను గుర్తిస్తే, ఆ వ్యాధి ముదరకుండా చూసే కొత్త రకం ఆధునాతన లూబ్రికేటింగ్ జల్‌ను డెవలప్ చేశారు. ధ్వంసమైన కార్టిలేజ్‌ను ఈ కొత్త తరహా హైడ్రోజల్ టార్గెట్ చేస్తుందని, ఆ ప్రాంత శరీర భాగానికి లూబ్రికేషన్ రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సె్కు చెందిన ప్రెస్ రిలీజ్ ద్వారా ఈ విషయం స్పష్టమైంది. షాంఘై రిసర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు లీ జూషెంగ్, లూ హెంగీతో పాటు చాంగ్సా ఆస్పత్రి ఆర్థోపెడిక్ డాక్టర్ వాంగ్ యుంజియా ఈ కొత్త తరహా జల్‌ను డెవలప్ చేశారు.
అడ్వాన్స్డ్ మెటీరియల్స్ జర్నల్‌లో చైనా బృందం కొత్త జల్ గురించి రిపోర్ట్‌ను పబ్లిష్ చేసింది. కొత్తగా డెవలప్ చేసిన పదార్ధంలో హైడ్రోజల్ మైక్రోస్పియర్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. సూక్ష్మ, గుండ్రటి పార్టికల్స్ ఉన్నాయని, వాటిని ఇంజెక్ట్ చేసే రీతిలో ఉంటాయని, గాయపడ్డ కణజాలం, కార్టిలేజ్, మాంసం, ఎముకలను ఆ జల్‌తో రిపేర్ చేయవచ్చు. మైక్రోస్పియర్స్ అనే బయోమెటీరియల్‌ను జెలాటిన్ మితాక్రైలేట్తో తయారు చేశారు. కొల్లాజన్ అనే సహజ ప్రోటీన్ నుంచి దీన్ని డెవలప్ చేశారు.