Pop Singer Kris Wu : చైనీస్, కెనడియన్ పాప్ సింగర్ క్రిస్ వూకు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో బీజింగ్‌లోని చావోయాంగ్ జిల్లాలోని కోర్టు శుక్రవారం అతడికి జైలు శిక్ష విధిచింది. డి మిజు అనే 19 ఏళ్ల బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిస్‌పై కేసు నమోదు చేశారు. డి మిజు 17 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెతో క్రిస్ డేట్‌కు వెళ్లాడు. ఆ సమయంలోనే క్రిస్ తనపై అత్యాచారం చేశాడని, మరో మహిళపై కూడా అతను అత్యాచారం చేశాడని డి మీజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో క్రిస్‌ను పోయిన ఏడాది జూలైలో అరెస్ట్ చేశారు. క్రిస్ తన నేరం ఒప్పుకోవడంతో కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది.
అత్యాచారం చేసినందుకు క్రిస్‌కు 11 ఏళ్ల 6 నెలలు జైలు శిక్ష పడింది. మరికొంతమందిని లైంగిక చర్యలకు ప్రోత్సహిస్తున్న కేసులో కోర్టు అతనికి 22 నెలలు జైలు శిక్ష విధించింది. దాంతో క్రిస్ 13 ఏళ్లు జైలులో ఉండనున్నాడు.
క్రిస్‌పై అత్యాచారం ఆరోపణలు రావడంతో పోర్షే, లూయిస్ వోటన్ వంటి ప్రముఖ బ్రాండ్లు అతడితో ఒప్పందం రద్దు చేసుకున్నాయి.చైనాకు చెందిన క్రిస్ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నాడు. అతడికి కెనడా పౌరసత్వం కూడా ఉంది. కొరియన్ పాప్ బాయ్‌బ్యాండ్ ఎక్సోలో చేరడంతో క్రిస్ పాపురల్ అయ్యాడు. 2014 నుంచి సొంతంగా ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. క్రిస్ సింగర్ మాత్రమే కాదు మోడల్, నటుడు కూడా.