Watch: పది అడుగుల దూరంలోకి అమెరికా, చైనా జెట్స్.. తర్వాత ఏం జరిగిందంటే?
US, Chinese jets came within 10 feet | అమెరికా, చైనా ఫైటర్ జెట్స్ అతి దగ్గరగా వచ్చాయి. రెండు యుద్ధ విమానాలు సుమారు పది అడుగుల దూరంలో పక్కపక్కగా గాల్లో ఎగిరినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది. (US, Chinese jets came within 10 feet) మంగళవారం దక్షిణ చైనా సముద్రంపై ఈ సంఘటన జరిగినట్లు పేర్కొంది.
వాషింగ్టన్: అమెరికా, చైనా ఫైటర్ జెట్స్ అతి దగ్గరగా వచ్చాయి. రెండు యుద్ధ విమానాలు సుమారు పది అడుగుల దూరంలో పక్కపక్కగా గాల్లో ఎగిరినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది. (US, Chinese jets came within 10 feet) మంగళవారం దక్షిణ చైనా సముద్రంపై ఈ సంఘటన జరిగినట్లు పేర్కొంది. ఈ నెల 24న రాత్రివేళ దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో ఎగురుతున్న అమెరికా బాంబర్‌కు 10 అడుగుల దూరంలోకి చైనా యుద్ధ విమానం వచ్చినట్లు వెల్లడించింది.
కాగా, తమ యుద్ధ విమానాన్ని ఢీకొనబోయేలా చైనా ఫైటర్ జెట్ పైలట్ వేగంగా దూసుకెళ్లినట్లు అమెరికా మిలిటరీ ఆరోపించింది. అంతర్జాతీయ గగనతల భద్రతా నియమాలు, నిబంధనలకు విరుద్ధంగా చైనా పైలట్ వ్యవహరించినట్లు విమర్శించింది. రాత్రి వేళ సరిగ్గా కనిపించని సమయంలో జరిగిన ఈ సంఘటన పట్ల తాము ఆందోళన చెందినట్లు పేర్కొంది. అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ ఈ మేరకు గురువారం ప్రకటించింది. అలాగే చైనా యుద్ధ విమానం చాలా వేగంగా అమెరికా బాంబర్ బీ-52 సమీపంగా దాని కింది నుంచి వెళ్లిన వీడియో క్లిప్‌ను కూడా విడుదల చేసింది.
#USINDOPACOM Statement on #PRC Unprofessional Intercept: "A People’s Republic of China J-11 pilot executed an unsafe intercept of a U.S. Air Force B-52 aircraft which was lawfully conducting routine operations over the South China Sea…"
Read more⬇️https://t.co/UnCmnneAr7 pic.twitter.com/6k79Koah3V
— U.S. Pacific Command (@USPACOM) October 26, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- American
- Chinese
- Come Close
- jets
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

