బీజింగ్ : చైనాకు చెందిన ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ బావో ఫాన్ ఆచూకీ లేరు. చైనా రినయసెన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థ చైర్మెన్ అయిన బావో ఆనవాళ్లు చిక్కడం లేదని ఆ కంపెనీ హాంగ్ కాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నది. బిలియనీర్ అయిన ఆ బ్యాంకర్‌ను చేరుకోలేకపోతున్నట్లు ఆ కంపెనీ తమ ఫైలింగ్‌లో వెల్లడించింది. దీదీ, మిటువాన్ లాంటి మేటి చైనా టెక్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టిన మేటి బ్యాంకర్లలో బావో ఫాన్ ఉన్నారు.
బావోకు చైనాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒప్పందాలు కుదర్చడంలో అతను మేటి. దీదీ, మిటువాన్ కంపెనీలు ఆయన క్లయింట్ల లిస్టులో ఉన్నాయి. అయితే బావో కనిపించుకుండా పోవడం అంటే.. వ్యాపారవేత్తలు, టెక్ లీడర్లపై చైనా సర్కార్ పంజా విసిరినట్లుగా భావిస్తున్నారు. బావోను కాంటాక్ట్ కాలేకపోతున్నట్లు కంపెనీ ప్రకటించగానే.. ఆ కంపెనీ షేర్లు డౌనయ్యాయి.
బావో ఎన్ని రోజులగా మిస్సింగ్‌లో ఉన్నాడో కంపెనీ స్పష్టం చేయలేదు. కానీ రెండు రోజుల నుంచి స్టాఫ్‌తో టచ్‌లో లేరని తెలుస్తోంది. చైనా రినయసెన్స్ సంస్థను బావో 2005లో స్థాపించారు. ఇప్పుడు ఆ సంస్థ చైనాలో టాప్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్గా ఎదిగింది.