China papulation : చైనా (china) లో ఏటా పడిపోతున్నది. వరుసగా నాలుగో ఏడాది కూడా అక్కడ జనాభా తగ్గుదల నమోదైంది. 2025 ఏడాది చివరికి చైనాలో 140.4 కోట్ల జనాభా ఉంది. 2024 ఏడదితో పోలిస్తే 30 లక్షల జనాభా తగ్గింది. చైనా ప్రభుత్వం సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2025 ఏడాది జననాల సంఖ్య కేవలం 79.2 లక్షలుగా నమోదైంది. 2024 జననాల సంఖ్యతో పోలిస్తే ఇది 17% తక్కువ. జనాభాపరంగా ఇది ప్రతికూల అంశమని అక్కడి ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు.
ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతోంది. చైనాలో ప్రజల జీవన వ్యయాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా పిల్లల పెంపకం చాలా ఖరీదుగా మారింది. పిల్లలకు 18 ఏళ్ల వరకు చదువుకు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి సరాసరి 76 వేల డాలర్లు (రూ.69 లక్షలు) ఖర్చు అవుతున్నట్లు అంచనా. దాంతో చాలామంది యువత పెళ్లిళ్లు చేసుకునేందుకు వెనకాడుతుండగా.. పెళ్లయిన వాళ్లు పిల్లల్ని కనేందుకు ఆలోచిస్తున్నారు. యువతలో ఈ వైఖరి మార్చేందుకు చైనా ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నది.
ప్రోత్సాహకాల్లో భాగంగా కండోమ్స్ సహా గర్భనిరోధక సాధనాలు, పలు వస్తువులపై 13 శాతం పన్నును విధిస్తూ విలువ ఆధారిత పన్ను (VAT) చట్టాన్ని ఇప్పటికే సవరించింది. పిల్లల సంరక్షణ సేవలు (నర్సరీ నుంచి కిండర్గార్టెన్స్ వరకు), వృద్ధుల సంరక్షణ, వికలాంగుల సేవలు, వివాహ సంబంధిత సేవలపై పన్ను మినహాయింపును జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది.