బీజింగ్: ‘ఈవీ బ్యాటరీ’ల తయారీలో చైనా కొత్త ఆవిష్కరణలతో దూసుకెళ్తోంది. చైనీస్ బ్యాటరీ కంపెనీ ‘ఎస్‌ఈవీబీ’ 1,400-ఏ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీని ఆవిష్కరించింది. కేవలం ఒక్క నిమిషం బ్యాటరీ చార్జింగ్‌తో 150 కిలోమీటర్ల రేంజ్‌ను పొందగలగటం ‘స్టార్ చేజర్ 2.0’ బ్యాటరీ ప్రత్యేకత. దీనిని 17వ షెన్జెన్ అంతర్జాతీయ బ్యాటరీ ఫెయిర్‌లో కంపెనీ ప్రదర్శించింది.
వాహనాలు పెట్రోల్ స్టేషన్లో ఇంధనాన్ని నింపుకున్నంత సులువుగా, ఈవీ బ్యాటరీల చార్జింగ్ సమయాన్ని తగ్గించేందుకు ఆయా కంపెనీలు పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నాయి. ఎస్‌ఈవీబీ 12-సీ సామర్థ్యం కలిగిన చార్జర్స్‌తో 450 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈవీ బ్యాటరీలు 5 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతాయి.