వాషింగ్టన్: చైనా సూపర్ కంప్యూటర్ లైన్‌షైన్(LineShine Supercomputer) తొలి ర్యాంక్ కొట్టేసింది. దీంతో శక్తివంతమైన కంప్యూటర్లలో అమెరికా వెనుకబడింది. 2017 తర్వాత తొలిసారి చైనా కంప్యూటర్లు టాప్ లిస్టులో ఉన్నాయి. షెన్జెన్లో ఉన్న లైన్‌షైన్ కంప్యూటర్.. సూపర్‌పవర్ రేసులో అమెరికాకు చెందిన ఎల్ క్యాప్టన్ను దాటేసింది. టాప్500 ర్యాంకులను మంగళవారం రిలీజ్ చేశారు. అయితే చైనీస్ కంప్యూటర్ తొలిసారి ఆ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చింది. టాప్500 ప్రాజెక్టు సైంటిస్టులు ప్రకారం లైన్‌షైన్ కంప్యూటర్ 2.198 ఎక్సాఫ్లాప్స్ అందుకున్నట్లు తెలిపారు. అంటే ఒక సెకనుకు 2 క్విన్టిలియన్ క్యాలికులేషన్స్ ఆ కంప్యూటర్ చేసినట్లు చెప్పారు.
చైనాలో జియాంగ్‌షూ ప్రావిన్సులోని నేషనల్ సూపర్కంప్యూటింగ్ సెంటర్లో లైన్‌షైన్ కంప్యూటర్ ఉన్నది. ఇక అమెరికాకు చెందిన కాలిఫోర్నియాలోని లారెన్స్ లివర్మోర్ నేషనల్ ల్యాబరేటరీలో ఎల్ క్యాప్టన్ కంప్యూటర్ ఉన్నది. ప్రస్తుతం ఎల్ క్యాప్టన్ కంప్యూటర్ రెండో ర్యాంక్‌లో ఉన్నది. అయితే అమెరికాలోని టెన్నిసెసి, ఇలియాస్ల్లో ఉన్న కంప్యూటర్లు తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి. ఇక జర్మనీకి చెందిన జ్యూపిటర్ కంప్యూటర్ అయిదో ర్యాంక్‌లో ఉన్నది. ఈ అయిదు సూపర్ కంప్యూటర్లకు మాత్రం వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉన్నది.
లైన్‌షైన్ కంప్యూటర్ మిగితా వాటికి భిన్నంగా ఉన్నది. సంప్రదాయ కంప్యూటర్ చిప్స్, సీపీయూలపై ఈ కంప్యూటర్ నడుస్తుంది. గ్రాఫిక్స్ ప్రాసెసర్లను వాడడం లేదు. 42.2 మెగావాట్ల విద్యుత్తుతో దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. ఇటలీ, స్విట్జర్లాండ్, జపాన్‌కు చెందిన సూపర్ కంప్యూటర్లు టాప్ టెన్‌లో ఉన్నాయి.