బీజింగ్: చంద్ర మండల అన్వేషణలో జోరుగా ముందుకు సాగుతున్న చైనా త్వరలో ప్రతిష్టాత్మక ‘చాంగే-7’ ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. చంద్రుని దక్షిణ ధృవంలో నీటి జాడలను కనుగొనేందుకు 6 కాళ్లతో కూడిన ఓ ఫ్లయింగ్ రోబోను పంపబోతున్నట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది.
‘చాంగే-7’ మిషన్లో అధునాతన ‘ఫ్లయింగ్ డిటెక్టర్’ రాకెట్ ప్రొపల్షన్ను ఉపయోగించుకుని పాకడం, దూకడం, పైకి ఎగరడం ద్వారా గతంలో ఎవరూ ప్రవేశించలేని ప్రాంతాలను అన్వేషించగలుగుతుంది.