బీజింగ్, జూన్ 18 : కొత్త రకమైన టెక్నాలజీలతో దూసుకుపోతున్న చైనా మరో ఆవిష్కరణ చేసింది. చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ తాజాగా దోమ సైజులో స్పై డ్రోన్ ను రూపొందించింది. ఇది చూడటానికి అచ్చం దోమలాగే ఉంటుంది. కాకపోతే దీన్ని అనేక రకాల సర్వైలెన్స్, స్పై ఆపరేషన్లలో వాడొచ్చని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. దీన్ని 0.3గ్రాముల బరువుతో, టినీ కెమెరాలు, సెన్సార్లతో డిజైన్ చేశారు.
ఇది అన్ని రకాల ఫొటోలు తీయడం, వాయిస్ ను రికార్డు చేయడంతో పాటు డాటాను సేకరిస్తుంది. కాకపోతే ఇది పెద్ద బ్యాటరీలను మోయలేదు కాబట్టి గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించలేదు. ఎలాంటి బరువులను కూడా మోసుకెళ్లలేదు. కేవలం టెక్నాలజీ పరమైన అవసరాల కోసం దీన్ని వాడొచ్చని, ఇప్పటికీ కొన్ని టెక్నికల్ పరమైన సమస్యలు ఉన్నాయని అధికారులు తెలియజేస్తున్నారు.