జిక్వాన్: టియాన్గాంగ్ స్పేస్ స్టేషన్(China Space Station)కు ముగ్గురు వ్యోమగాములను చైనా పంపింది. షెంజౌ-19 మానవసహిత స్పేస్షిప్ను చైనా ప్రయోగించింది. లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ ద్వారా ముగ్గురు టైకోనాట్లు నింగిలోకి వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున 4.27 నిమిషాలకు జిక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి రాకెట్ ఎగిరింది. ఈసారి వ్యోమగాముల్లో మహిళా టైకోనాట్ కూడా ఉన్నది. టియాన్గాంగ్ స్పేస్ స్టేషన్లో వ్యోమగామలు పలు పరీక్షలు చేపట్టనున్నారు. 2030 నాటికి చంద్రుడి మీదకు చైనా వ్యోమగాములను పంపాలని భావిస్తున్నది. లూనార్ కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్న చైనా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
టైకోనాట్లలో 34 ఏళ్ల వాంగ్ హౌజీ అనే మహిళా ఆస్ట్రోనాట్ ఉన్నారు. స్పేస్ స్టేషన్కు వెళ్లిన మహిళా ఆస్ట్రోనాట్లలో ఆమె మూడవ వ్యక్తి కావడం విశేషం. రాకెట్ ప్రయోగం సక్సెస్ అయినట్లు చైనా స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. కాయి జూజీ నేతృత్వంలో ముగ్గురు వ్యోమగాములు నింగిలోకి వెళ్లారు. ఏప్రిల్ లేదా మే నెలలో వాళ్లు మళ్లీ భూమ్మీదకు రానున్నారు. కాయి జూపీ గతంలో 2022లో షెంజౌ-14 మిషన్ ద్వారా స్పేస్ స్టేషన్కు వెళ్లారు. ఆస్ట్రోనాట్లలో 34 ఏళ్ల సాంగ్ లింగ్డాంగ్ కూడా ఉన్నారు.