వాషింగ్టన్: అమెరికా ఇప్పటివరకు ఎదుర్కొన్న శత్రువుల్లో కమ్యూనిస్ట్ చైనా అత్యంత బలమైన, క్రమశిక్షణ కలిగిన శత్రువని రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. శుక్రవారం జరిగిన రిపబ్లికన్ పార్టీ కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్లో ఆమె ప్రసంగించారు.
అమెరికాను ద్వేషించే దేశాలకు ఆర్థిక సాయం చేయకూడదని పునరుద్ఘాటించారు. చైనా కంపెనీలు 3.8 లక్షల ఎకరాలకు పైగా అమెరికా భూములను సొంతం చేసుకొన్నాయని, అవి సైనిక స్థావరాల పక్కనే ఉన్నా మనమేం చేస్తున్నామని ప్రశ్నించారు.